తెలంగాణలో నేడు, రేపు వడగళ్ళ వాన.... వాతావరణశాఖ హెచ్చరిక

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన‌ వడగళ్ల వాన‌ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement
Update:2023-03-24 07:35 IST

తెలంగాణ లో నాలుగు రోజుల క్రితం కురిసిన వడగళ్ళవాన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పంటల‌ను నాశనం చేసింది. ఆ నష్టంతో అతలా కుతలమవుతున్న‌ రైతులకు మరో షాకింగ్ వార్త వినిపించింది వాతావరణ శాఖ.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన‌ వడగళ్ల వాన‌ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా వాతావరణం మారిపోయింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తూ వాతావరణాన్ని చల్లబరిచాయి. ద్రోణి ప్రభావం కొనసాగుతుండడమే ఇందుకు కారణం. ఇప్పుడిక మళ్ళీ రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన‌ వడగళ్ల వాన‌ పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్పి‍ంది

కాగా, పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నిన్న ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. 

Tags:    
Advertisement

Similar News