నల్గొండ ఎంపీ సీటుపై గుత్తా అమిత్‌రెడ్డి కొత్త లెక్క.. నమ్మేలాగే ఉందిగా!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిలో కాంగ్రెస్ గెలిచింది. సాధారణంగానే నల్గొండ కాంగ్రెస్‌కు కంచుకోట.
నల్గొండ లోక్‌సభ టికెట్ తన కొడుకు అమిత్‌రెడ్డికే ఇవ్వాలని బీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి పట్టబడుతున్నారు. ఇందుకోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అమిత్‌రెడ్డి మాత్రం టికెట్‌పై అధిష్టానానిదే నిర్ణయమని, తనకు ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని చెప్పుకొస్తున్నారు.
ఏడింట్లో ఆరు కాంగ్రెస్ పరం
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిలో కాంగ్రెస్ గెలిచింది. సాధారణంగానే నల్గొండ కాంగ్రెస్‌కు కంచుకోట. కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి వంటి సీనియర్ నేతల ప్రాబల్యంతో ఇక్కడ పార్టీ బలంగా ఉంటుంది. దీనికి తోడు తాజా ఎన్నికల్లో భారీగా సీట్లు తెచ్చుకోవడంతో ఇక్కడ నుంచి ఎలాగైనా గెలిచి, తన సిట్టింగ్ ఎంపీ సీటు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
అమిత్ లెక్క ఇదీ..
ఇదే మాట మీడియావాళ్లు అమిత్‌రెడ్డిని ప్రశ్నిస్తే ఆయన ఒక ఆసక్తికరమైన ఈక్వేషన్ చెప్పారు. 2018 ఎన్నికల్లో నల్గొండ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో ఆరింటిలో బీఆర్ఎస్ గెలిచిందని, కానీ 2019లో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సీను మారిపోయి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూడా తాము ఆరింటిలో ఓడిపోయినా త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తాము గెలిచి, గతంలో కాంగ్రెస్ చేసిన ఫీట్‌నే రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వినడానికి బాగానే ఉంది కానీ, ఇది వర్కవుట్ అవుతుందా.. లేదా అన్నదే ప్రశ్న.