రాష్ట్రంలో మళ్లీ తుపాకీ రాజ్యం వచ్చింది

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

Advertisement
Update:2024-12-05 19:38 IST

రేవంత్‌ రెడ్డి పాలనలో రాష్ట్రంలో మళ్లీ తుపాకీ రాజ్యం వచ్చిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మండిపడ్డారు. గురువారం రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎ డైరెక్షన్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా.. ఉల్టా ఎమ్మెల్యపైనే కేసు పెడుతారా అని ప్రశ్నించారు. మాజీ హోం మంత్రి మహమూద్‌ అలీకి కనీసం గౌరవం ఇవ్వడం లేదన్నారు. సమైక్య రాష్ట్రంలోనే వేలాది మంది పోలీసుల మధ్యలో జైబోలో తెలంగాణ అని ఉద్యమించామని గుర్తు చేశారు. కేసులు కొత్త కాదని, లక్షల కేసులు పెట్టినా ఎదుర్కొంటామని.. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. రేవంత్‌ను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. లగచర్లలో ఏం జరిగిందో తెలుసు కదా అన్నారు. రేవంత్‌ రెడ్డి ముందు ఫ్రస్ట్రేషన్‌ నుంచి బయటకు రావాలని సలహా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ నాయకులందరినీ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News