తెలంగాణ వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో గ్రూప్‌-2 పరీక్షలు

ఈనెల 15, 16 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ వెల్లడించింది.

Advertisement
Update:2024-12-07 21:45 IST

డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.

మధ్యాహ్నం పరీక్షకు 1.30 నుంచి 2.30గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కారణాలతో మూడు సార్లు గ్రూప్-2 వాయిదా పడగా.. ఈ ఏడాది ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్.2 పరీక్ష ఇప్పటికి మొత్తం నాలుగు సార్లు వాయిదా పడింది. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు.

Tags:    
Advertisement

Similar News