యథావిధిగా గ్రూప్‌-1 మెయిన్స్‌

గ్రూప్‌-1 నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

Advertisement
Update:2024-10-15 11:00 IST

గ్రూప్‌-1 పరీక్షలకు అడ్డంకి తొలిగింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈనెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్‌- ప్రిలిమ్స్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ప్రిలిమ్స్‌లో ఏడు ప్రశ్నలకు ఫైనల్‌ కీలోనూ సరైన సమాధానాలు ఇవ్వలేదని, ఆ ప్రశ్నలకు మార్కులు కలిపి జాబితా మరోసారి విడుదల చేయాలని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాల్లోని ప్రశ్నలపై ఆయా సబ్జెక్టుల నిపుణుల దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాతే ఫైనల్‌ కీ విడుదల చేశామని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. పరీక్షల నిర్వహణపై సర్వీస్‌ కమిషన్‌కు తుది అధికారం ఉంటుందని.. గ్రూప్‌ మెయిన్స్‌కు ఇప్పటికే 30 వేలకు పైగా అభ్యర్థులు సిద్ధమయ్యారని కోర్టుకు వివరించింది. ఈ దశలో హైకోర్టు జోక్యం చేసుకుంటే సన్నద్ధమౌతున్న అభ్యర్థులంతా నష్టపోతారని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ ఆ పిటిషన్లు కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. 

Tags:    
Advertisement

Similar News