గ్రామ పంచాయతీలకు రూ. 1190 కోట్ల బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం

నిధుల విడుదలతో సర్పంచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన స‌ర్పంచుల సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, హ‌రీశ్ రావుకు కృత‌జ్ఞత‌లు తెలిపారు.

Advertisement
Update:2023-05-23 22:59 IST

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.1,190 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల‌ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు, పంచాయ‌తీరాజ్‌ శాఖ‌ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు సమావేశమై బకాయిల విషయమై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయ‌తీల్లో వివిధ ప‌నుల‌కు సంబంధించి నిలిచిపోయిన‌ బ‌కాయిలను 1,190 కోట్ల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణయించారు. ఈ మేర‌కు వెంటనే ఆ నిధులను విడుద‌ల చేయాల‌ని సంబంధిత అధికారులను ఆదేశించారు.

నిధుల విడుదలతో సర్పంచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన స‌ర్పంచుల సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, హ‌రీశ్ రావుకు కృత‌జ్ఞత‌లు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News