రూ.1,377 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు
92 నియోజకవర్గాల్లో 641 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
Advertisement
గ్రామీణ ప్రాంతాల్లో 1,323.86 కి.మీ.ల పొడవైన కొత్త రోడ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 92 నియోజకవర్గాల్లో 641 పనులకు ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.1,377. 66 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు ప్రకటించింది. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ కోసం రెండు, మూడు రోజుల్లోనే రూ.400 కోట్లు విడుదల చేయబోతున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
Advertisement