గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ నిగ్గు తేల్చేందుకు టాస్క్‌ఫోర్స్
అంగన్‌వాడీలు, హాస్పిటళ్లలోనూ తనిఖీలు చేపట్టనున్న కమిటీ
గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో ప్రభుత్వం మేల్కొన్నది. ఫుడ్ పాయిజన్‌కు కారణాలను అన్వేషించడానికి గురువారం ముగ్గురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కూడిన కమిటీ గురుకులాల్లో తనిఖీలు నిర్వహిస్తుంది. ఇప్పటికే ఫుడ్ పాయిజన్ జరిగిన గురుకులాలు, ఇతర విద్యాసంస్థల్లో మొదట తనిఖీలు చేపట్టి కారణాలను అన్వేషిస్తుంది. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఆహార నాణ్యతను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని ప్రభుత్వాన్ని అభిశంసించినంత పని చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్ పాయిజన్ ఘటనలపై రియాక్ట్ అయ్యారు. ఫుడ్ పాయిజన్ జరగకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.