గవర్నర్ జీ.. వాళ్లపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వండి
రాష్ట్ర గవర్నర్ కు ఎంప్లాయీస్ జేఏసీ విజ్ఞప్తి
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడికి ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు గవర్నర్ ను కోరారు. ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి ఈమేరకు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే అధికారులపై కొందరు ప్రేరేపించి దాడులు చేయించారని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లగచర్ల బాధితుల గోడు వినడానికి వచ్చిన నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ను ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు సోమవారం సాయంత్రం కలిశారు. ఘటన వెనుకున్న వ్యక్తులను గుర్తించేలా విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం గవర్నర్ ను కలిసి దాడి వెనుక ఉన్న వాళ్లపై చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.