ఆశాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం : మంత్రి దామోదర
ఆశాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహపేర్కొన్నారు
Advertisement
రాష్ట్రంలో ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వారి డిమాండ్స్ సాధ్యాసాధ్యాలను బట్టి ఒక్కొక్కటి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాజకీయ కుట్రతో ప్రేరేపించే వారి ఉచ్చులో పడవద్దని ఆయన సూచించారు. ధర్నా చౌక్ నే మాయం చేసిన వాళ్ళు.. మీ ధర్నాలకు వారు అండగా ఉంటామనడం హాస్యాస్పదం అన్నారు. ఆశాలకు ఇప్పుడు మద్ధతు తెలపడం కంటే.. పదేళ్ళ కాలంలో వారి సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని మంత్రి నిలదీశారు. అప్పుడే వారి డిమాండ్స్ తీర్చి ఉంటే ఇప్పుడు వారు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని వెల్లడించారు.
Advertisement