చైనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉండటానికి కొన్ని మార్గదర్శకాలను తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసింది

Advertisement
Update:2025-01-04 18:09 IST

చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ విజృంభిస్తున్నా నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉండటానికి కొన్ని మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించాలని, సబ్బు లేదా శానిటైజర్‌తో మీ చేతులను తరచుగా కడగాలని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని, అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు దగ్గరకి వెళ్లకూడదని అంటూ కొన్ని మార్గదర్శకాలను సూచించిన హెల్త్ డిపార్ట్మెంట్.

ఈ కొత్త వైరస్ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలంగాణలో ఇప్పటి వరకు హెచ్‌ఎంపీవీ కేసులు ఏవీ నమోదు కాలేదని శనివారం పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా.బి. రవీంద్ర నాయక్ తెలిపారు. హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ నివేదికలకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ కేంద్ర ఆరోగ్య శాఖతో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని చెప్పారు. 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 డిసెంబర్ లో శ్వాసకోస ఇన్ ఫెక్షన్ ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఏమీ లేదని ఆరోగ్యశాఖ నిర్ధారించింది. ఈ మేరకు మెటాప్‌న్యూమోవైరస్ వ్యాప్తి లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

Tags:    
Advertisement

Similar News