రైతులకు గుడ్‌న్యూస్.. రైతుబంధుకు రేవంత్ గ్రీన్‌సిగ్నల్
ఎన్నికలకు ముందు యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధుల విడుదలకు గత ప్రభుత్వం ప్రయత్నించినా.. అనివార్య కారణాల వల్ల నిధుల విడుదల సాధ్యం కాలేదు.
రైతుబంధు నిధులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురుచూస్తున్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పాత పద్ధతి ప్రకారమే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ట్రెజరీలో ఉన్న నిధులను పంట పెట్టుబడి సాయం కోసం రిలీజ్ చేయాలని సూచించారు.
ఎన్నికలకు ముందు యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధుల విడుదలకు గత ప్రభుత్వం ప్రయత్నించినా.. అనివార్య కారణాల వల్ల నిధుల విడుదల సాధ్యం కాలేదు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగిపోయింది. రైతులకు రైతు భరోసా స్కీమ్ కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు అందిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్. గత ప్రభుత్వంలో బీడు భూములు, భూస్వాములకు వందల కోట్లు దోచి పెట్టారని, వీటన్నింటిపై సమీక్షించిన తర్వాతే నిధులు విడుదల చేస్తామని పలువురు కాంగ్రెస్ మంత్రులు, నేతలు ప్రకటించారు. ట్రెజరీలో నిధులు లేవని, ఇప్పటికిప్పుడు రైతు భరోసా అమలుకు రూ. 11 వేల కోట్లు అవసరమవుతాయని వార్తలు వచ్చాయి. ఆ మొత్తం ఖజానాలో లేకపోవడంతో రైతు భరోసా నిధులు ఇప్పట్లో విడుదల కావంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరగింది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది.
ఇప్పటికే యాసంగి సీజన్‌కు సంబంధించి పనులు మొదలుకావడం, రైతు భరోసా స్కీమ్‌కు సంబంధించి ఇంకా గైడ్‌లైన్స్ ఖరారు కాకపోవడంతో.. పాత పద్ధతి ప్రకారమే పంట పెట్టుబడి సాయం కోసం నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులను ఇందుకోసం ఉపయోగించాలని సూచించారు. వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. కౌలు రైతులను గుర్తించే విధానాన్ని సైతం ఖరారు చేయాల్సి ఉంది. కౌలు రైతులకు సైతం ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.