జీవో 29 రాజ్యాంగస్ఫూర్తికి, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు వ్యతిరేకం

పంతాలకు, పట్టింపులకు పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని బండి సంజయ్‌ సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ

Advertisement
Update:2024-10-20 22:21 IST

సీఎం రేవంత్‌రెడ్డి పంతాలకు, పట్టింపులకు పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. సోమవారం నుంచి పరీక్షలని తెలిసినా అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్నారంటే అర్థం చేసుకోండి. నిరుద్యోగులంతా మీ కుటుంబసభ్యులుగా భావించి వారి ఆవేదనను అర్థం చేసుకోండి. గ్రూప్‌-1 పరీక్ష రీ షెడ్యూల్‌ చేయండి. జీవో 29 వల్ల గ్రూప్‌-1 పరీక్షల్లో 5,300 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హులయ్యారు.

563 పోస్టులకు 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ మొత్తం పోస్టుల్లో 354 రిజర్వు పోస్టులు. జీవో 29 వల్ల ఓపెన్‌ కేటగిరిలో క్వాలిఫై అయిన రిజర్వ్‌ అభ్యర్థులనూ రిజర్వ్‌ కేటగిరిలో చేర్చడం అన్యాయం. ఈ జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు 1:50 చొప్పున అర్హత సాధిస్తే.. ఓసీ వర్గాలు 1:65 శాతం మేర అర్హత సాధించాయి. జీవో 29 రాజ్యాంగస్ఫూర్తికి, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు వ్యతిరేకం అన్నారు. గ్రూప్‌-1 అభ్యర్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. పరీక్షలు రీ షెడ్యూల్‌ చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. ఈ జీవో వల్ల రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేయబోతున్నారనే చర్చ మొదలైంది. తక్షణమే జీవో 29 ఉపసంహరింరుకోవాలని సంజయ్‌ లేఖలో పేర్కొన్నారు. 

Tags:    
Advertisement

Similar News