ఫుడ్ పాయిజన్ పై సమగ్ర నివేదిక ఇవ్వండి
కరీంనగర్ కలెక్టర్ కు బీసీ కమిషన్ ఆదేశం
Advertisement
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శర్మనగర్ లో ఉన్న జ్యోతిభా ఫూలే బీసీ గురుకుల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ ను బీసీ కమిషన్ ఆదేశించింది. బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ బుధవారం కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతికి లేఖ రాశారు. పత్రికల్లో ప్రచురితమైన వార్తల ద్వారా గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి మూడు రోజుల్లోనే తమకు సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు.
Advertisement