ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా ఘంటా చక్రపాణి

గవర్నర్‌ అనుమతితో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Advertisement
Update:2024-12-06 16:42 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓనెన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతితో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సోషియాలజీ సీనియర్‌ ప్రొఫెసర్‌ అయిన చక్రపాణి కొంతకాలం క్రితం రిటైర్‌ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా ఆరేళ్ల పాటు సేవలందించారు. జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన చక్రపాణి ఓపెన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పని చేస్తూనే తెలంగాణ భావజాలి వ్యాప్తికి కృషి చేశారు.



Tags:    
Advertisement

Similar News