తెలంగాణలో సమగ్ర కుల గణనపై జీవో విడుదల
సమగ్ర కులగణనపై తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
సమగ్ర కులగణనపై తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల అంశాలపై ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే బాధ్యతను ప్రణాళికశాఖకు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సమగ్ర కులగణనకు తెలంగాణ శాసన సభలో ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే, తాజాగా.. ఈ సమగ్ర కులగణన విషయంలో ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.
Advertisement