హైదరాబాద్‌లో గంజా చాక్లెట్లు..స్కూలు పిల్లలే లక్ష్యం?

హైదరాబాద్ లో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. ముఖ్యంగా వీటిని చిన్న పిల్లలకు విక్రయిస్తున్నారాణి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

Advertisement
Update:2024-02-25 13:39 IST

హైదరాబాద్ లో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. ముఖ్యంగా వీటిని చిన్న పిల్లలకు విక్రయిస్తున్నారాణి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఒడిశాకు చెందిన అనంత కుమార్ అనే వ్యక్తి బాలనగర్ ప్రాంతంలోని ఘరక్ కంఠా ప్రాంతంలో ఓ చిన్న కిరాణా షాపును నిర్వహిస్తున్నాడు. అయితే నిందితుడు తన కిరాణా షాప్ లో గంజాయి చాక్లెట్ లు అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం అందించింది. దీంతో బాలానగర్ SOT పోలీసులు రంగంలోకి దిగారు. షాపును తనఖీ చేయగా కొన్ని గంజాయి చాక్లెట్ లు పట్టుబడ్డాయి. తదుపరి విచారణలో తన స్కూటీ సీట్ కింద డిక్కీ లో దాచి ఉంచిన 3 ప్యాకెట్లలో 120 చాక్లెట్లను పోలీసులు గుర్తించారు. వీటిని ఒడిశా నుంచి తీసుకుని వచ్చి బాలానగర్ ప్రాంతంలోని కూలీలకు, విద్యార్థులకు అమ్ముతునట్లు పోలీసులు గుర్తించారు. నిందితుణ్ని బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొద్దికాలం క్రితం రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు కూడా గంజాయి చాక్లెట్లు విక్రయించారు. స్కూల్‌లో విద్యార్థులు వింతగా ప్రవర్తించటాన్ని గమనించిన టీచర్లు ఆరా తీయగా గంజాయి చాక్లెట్ల వ్యవహారం బయటపడింది. స్కూల్ సమీపంలోని చిల్లరకొట్టు డబ్బాల్లో ఈ చాక్లెట్లు విక్రయిస్తున్నారని గుర్తించి నిందితులను పట్టుకొని జైలుకు పంపించారు. తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశాతో కొందరు వ్యక్తులు చేసిన పనిగా పోలీసులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News