కాబోయే సీఎం కేటీఆర్.. కూకట్ పల్లిలో వెలసిన ఫ్లెక్సీలు

కూకట్ పల్లిలో మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. అందులో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. ఇప్పుడు తెలంగాణలో ఈ ఫ్లెక్సీల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

Advertisement
Update:2022-12-02 20:06 IST

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో రాష్ట్రానికి కాబోయే సీఎం కేటీఆర్ అంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు వెలియడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఉన్నప్పటికీ పార్టీ రాజకీయాలు మొత్తం కేటీఆర్ ద్వారానే నడుస్తున్నాయి. ప్రధాన ఇష్యూలపై స్పందించడం, రాజకీయంగా ఎదురైన విమర్శలకు కౌంటర్ ఇవ్వడం, అభివృద్ధి పనులను ప్రారంభించడం, ప్రజల్లోకి వెళ్లడంలో అన్నింటా కేటీఆర్ నే కనిపిస్తున్నాడు.

అటు మీడియాలో ఇటు జనంలో కేసీఆర్ కంటే కేటీఆరే ఎక్కువగా కనిపిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక‌ కొంతకాలం ఇటువంటి ప్రచారం జరగలేదు. మళ్లీ కొన్ని నెలల కిందట కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే అది కూడా సద్దుమణగగా మళ్లీ ఇప్పుడు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.

తాజాగా కూకట్ పల్లిలో మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. అందులో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. ఇప్పుడు తెలంగాణలో ఈ ఫ్లెక్సీల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇటువంటి ప్రచారం జరిగిన సమయంలో కేటీఆర్ కూడా స్పందించారు. తన తండ్రి కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంతవరకు ఆయనే సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా మారింది. మరి వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ కేంద్రం వైపు దృష్టి పెడితే రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News