హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల

హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

Advertisement
Update:2024-12-03 15:51 IST

జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల సంరక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రాకు తెలంగాణ ప్రభుత్వం రూ.50 కోట్లు మంజురు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు హైదరాబాద్‌లోని మహేశ్వరం నియోజకవర్గంలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పోరేషన్‌లోని అల్మాస్‌గూడ గ్రామంలో శ్రీవెంకటేశ్వర కాలనీలోని పార్క్ స్థలంలో ఏర్పాటు చేసిన రెడిమేడ్ కంటైనర్‌ను హైడ్రా అధికారులు తొలగించారు. హైడ్రా ఇన్స్‌పెక్టర్ తిరుమలేశ్ ఆధ్వర్యంలో జేసీబీతో తొలగించారు.

Tags:    
Advertisement

Similar News