ఫార్ములా ఈ-రేస్ తో బీఆర్‌ఎస్ రూ. కోట్ల లబ్ధి
రేస్ నిర్వహించిన గ్రీన్‌కో సంస్థ ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ. 41 కోట్లు చెల్లించినట్లు తెలిపిన ప్రభుత్వం
Advertisement
ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలకాంశాలను బైటపెట్టింది. రేస్ నిర్వహించిన గ్రీన్‌కో సంస్థ ద్వారా బీఆర్‌ఎస్‌కు రూ. కోట్లలో లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ. 41 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రీన్‌కో, అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నట్లు వెల్లడించింది. 2022 ఏప్రిల్ 8-అక్టోబర్ 10 మధ్య కొన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు విచారణ కోసం వచ్చిన సంగతి తెలిసిందే. తనతోపాటు న్యాయవాదిని లోపలికి పోలీసులు అనుమతించకపోవడంతో కేటీఆర్ అక్కడి నుంచి వెనుదిరిగారు.మరోవైపు ఆయనకు మళ్లీ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
Advertisement