న్యూ ఇయర్‌ కు ఫుల్‌ కిక్కు!

నిన్న ఒక్కరోజే రూ.402 కోట్ల మద్యం అమ్మకాలు

Advertisement
Update:2024-12-31 15:40 IST

న్యూ ఇయర్‌ కు ఫుల్‌ లిక్కర్‌ కిక్కుతో గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పనున్నారు. సోమవారం ఒక్కరోజే రూ.402.62 కోట్ల విలువైన మద్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముడయ్యింది. మంగళవారం అంతకన్నా ఎక్కువే లిక్కర్‌ అ మ్ముడుపోతుందని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం 3,82,265 కేసుల లిక్కర్‌, 3,96,114 కేసుల బీర్‌ అమ్ముడుపోయింది. డిసెంబర్‌ ఒక్కనెలలో (ఒకటో తేదీ నుంచి 30 వరకు) మద్యం అమ్మకాలతో ఎక్సైజ్‌ శాఖకు 3,523.16 కోట్ల ఆదాయం సమకూరింది. మంగళవారం అమ్మకాలను లెక్కలోకి తీసుకుంటే ఈనెలలో సర్కారు మద్యం కిక్కు మస్తుగానే ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే లిక్కర్‌ గోదాముల నుంచి పెద్ద ఎత్తున మద్యం షాపులకు లిక్కర్‌ డంప్‌ చేశారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచనున్నారు. ఎలైట్‌ బార్లు, పబ్స్‌, అనుమతులు పొందిన ఈవెంట్లలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మద్యం సర్వ్‌ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. దీంతో న్యూ ఇయర్‌ వేళ మద్యం అమ్మకాలు మరింత జోరందుకోనున్నాయి.

Tags:    
Advertisement

Similar News