హైదరాబాద్ లో సౌత్ డీజీపీల కీలక సమావేశం..
మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల డీజీపీలు ఒకేచోట సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. మావోయిస్ట్ ల కదలికలు పూర్తిస్థాయిలో తుడిచిపెట్టేందుకు అన్ని రాష్ట్రాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లేందుకు ఈ సమావేశంలో మరో ముందడుగు పడినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం జరిగింది. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర డీజీపీ రజనీష్ సేథ్, ఛత్తీస్ గఢ్ డీజీపీ అశోక్ జునేజా, ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేందర్ నాథ్ రెడ్డి, సీఆర్‌పీఎఫ్ ఐజీ చారు సిన్హా, ఇంటెలిజెన్స్ బ్యూరో సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మావోయిస్ట్ ల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులు చర్చించారు. సమాచార భాగస్వామ్యం, ఉమ్మడి శిక్షణ, ఉమ్మడి కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలు ఈ మీటింగ్ లో ప్రస్తావనకు వచ్చాయి.
మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల డీజీపీలు ఒకేచోట సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. మావోయిస్ట్ ల కదలికలు పూర్తిస్థాయిలో తుడిచిపెట్టేందుకు అన్ని రాష్ట్రాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లేందుకు ఈ సమావేశంలో మరో ముందడుగు పడినట్టు తెలుస్తోంది. గతంలో కూడా సమాచార మార్పిడి ఉన్నా కూడా.. ప్రస్తుత టెక్నాలజీతో ఆ సమాచారాన్ని మరింత విశ్లేషణ చేసి మావోయిస్ట్ ల వ్యవహారాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణతోపాటు, తెలంగాణ సరిహద్దులో ఉన్న మిగతా మూడు రాష్ట్రాల డీజీపీలు, ఇంటెలిజెన్స్ అధికారులు ఈరోజ సమావేశంలో కీలక అంశాలు చర్చించారు. మావోయిస్ట్ ల ప్రభావాన్ని ఎదుర్కొనే దిశగా పోలీసు విభాగం శిక్షణ కార్యక్రమాలపై కూడా ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్ట్ ల కదలికలను ఎదుర్కోవడం, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారి గురించి వెంటనే సమాచారమివ్వడం వంటి విషయాలపై చర్చించారు.