మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారణ అనంతరం కొడంగల్ కోర్టుకు తరలించారు.14రోజుల రిమాండ్ విధించింది.
లగచర్లలో వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నరేందర్‌రెడ్డిని పరిగి జైలుకు తరలించారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద అరెస్టు చేశారు. వికారాబాద్ డీటీసీ కార్యాలయంలో ఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కొడంగల్ కోర్టుకు తరలించగా కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. కోర్టుకు తరలించే క్రమంలో నరేందర్ రెడ్డి అక్కడ ఉన్న మీడియాను చూసి తన అరెస్టు అక్రమమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.
కొడంగల్‌లో రైతుల తిరుగుబాటుతో ముఖ్యమంత్రి పరువు తన పరువు నిలుపుకునే క్రమంలో లగచర్లలో జరిగిన ఘటనను బీఆర్‌ఎస్ పార్టీకి ఆపాదించి కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే లగచర్ల కేసులో పోలీసులు 16 మంది రైతులను అరెస్టు చేయగా, వారికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వారిని కూడా పరిగి సబ్ జై లుకు తరలించారు. న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని భారీ బందోబస్తు నడుమ జైలుకు తరలిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ నినాదాలు చేశారు. కొడంగల్ కోర్టు ప్రాంగణంతో పాటు.. జైలుకు తరలించే మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.