బీజేపీకి షాకివ్వనున్న ఏనుగు.. నెక్ట్స్ ఏ పార్టీలోకి అంటే..!
ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీని వీడాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
బీజేపీ సీనియర్ నేత, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పక్క చూపులు చూస్తున్నారా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈనెల 17న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరపున గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ చేతిలో ఓడిపోయారు. తర్వాత సురేందర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్‌లో తనకు తగిన ప్రాధాన్యత లేదని.. 2021లో ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీలో చేరిపోయారు ఏనుగు రవీందర్ రెడ్డి.
ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీని వీడాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎల్లారెడ్డి నుంచి బీజేపీ టికెట్ కోసం కూడా ఆయన దరఖాస్తు చేసుకోలేదు. మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఇప్పటికే మదన్‌మోహన్ రావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి సై అంటే సై అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏనుగు రవీందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ దక్కుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.