భూమికి జానెడు లేవు.. రేవంత్‌కు హరీష్ స్ట్రాంగ్ కౌంటర్
మెదక్, సిద్దిపేట జిల్లాలను రద్దు చేస్తానని ఓ వైపు చెప్తూనే.. మరోవైపు ఈ జిల్లా గురించి ఎలా మాట్లాడతావంటూ రేవంత్‌ను ప్రశ్నించారు హరీష్ రావు.
మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి తన మూర్ఖత్వాన్ని మరోసారి చాటుకున్నారని, ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రేవంత్ అసహనం వ్యక్తం చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు.
ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రంలో అభివృద్ధి కేవలం గజ్వేల్, మెదక్ జిల్లాలో జరిగిందని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు హరీష్ రావు. ఇందిరాగాంధీ మెదక్‌కు ఏం చేసిందో చెప్పాలన్నారు హరీష్ రావు. మెదక్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది, రైల్వే లైన్ తెచ్చింది కేసీఆరేనన్నారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులతో మెదక్‌లో లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించామని గుర్తుచేశారు. మెదక్ జిల్లాకు మూడు యూనివర్సిటీలు తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు హరీష్ రావు.
మెదక్, సిద్దిపేట జిల్లాలను రద్దు చేస్తానని ఓ వైపు చెప్తూనే.. మరోవైపు ఈ జిల్లా గురించి ఎలా మాట్లాడతావంటూ రేవంత్‌ను ప్రశ్నించారు హరీష్ రావు. ముఖ్యమంత్రి పదవిపై గౌరవంతో రేవంత్ ఎత్తు గురించి తానెప్పుడూ మట్లాడలేదన్నారు హరీష్ రావు. కానీ తనను పదేపదే దూలమొలే పెరిగావ్ అని రేవంత్ విమర్శిస్తున్నారని, ఆయనకు ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుందన్నారు. భూమికి జానెడు లేని రేవంత్‌కు ఆవగింజంత మెదడు కూడా దేవుడు ఇవ్వలేదని తాను కూడా అనొచ్చన్నారు. పాలన చేతగాక బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారంటూ రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మాట తప్పిన రేవంత్‌కు మోసం కొత్త కాదన్నారు హరీష్. మోసం రేవంత్ నైజమంటూ ఎద్దేవా చేశారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే అది కచ్చితంగా రేవంత్‌కే వస్తుందన్నారు హరీష్ రావు.