పారిపోయిన చరిత్ర నీది.. ప్రజాపక్షం నాది - హరీష్ రావు
ఇప్పటికీ కూడా ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2లక్షల రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన 13 హామీలను అమలు చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు హరీష్ రావు. లేదంటే రాజీనామాకు సిద్ధమా అంటూ రేవంత్‌కు సవాల్ విసిరారు.
రాజీనామా సవాల్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్ను చూపింది తమరేనంటూ రేవంత్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు హరీష్ రావు. కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి.. తర్వాత వెన్నుచూపి పారిపోయింది కూడా తమరేనంటూ ఎద్దేవా చేశారు. నిరంతరం పారిపోయిన చరిత్ర నీదంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు హరీష్ రావు. అనునిత్యం ప్రజల పక్షం నిలిచిన చరిత్ర తనదన్నారు.
ఉద్యమ సమయంలో పదవుల కోసం తమరు పెదవులు మూసుకుని కూర్చుంటే.. మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తనదన్నారు హరీష్ రావు. తనకు పదవులు, రాజీనామాలు కొత్త కాదన్నారు. ప్రజలకు, రైతులకు, పేదలకు మేలు జరుగుతుందంటే ఎన్ని సార్లు రాజీనామా చేయడానికైనా తాను సిద్ధమన్నారు. ఇప్పటికీ కూడా ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2లక్షల రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన 13 హామీలను అమలు చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు హరీష్ రావు. లేదంటే రాజీనామాకు సిద్ధమా అంటూ రేవంత్‌కు సవాల్ విసిరారు.
ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీల్లోని 13 హామీలను నెరవేరిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ గతంలో సవాల్ విసిరారు హరీష్ రావు. అయితే తాజాగా హరీష్ రావు సవాల్‌పై స్పందించిన రేవంత రెడ్డి.. తాము రాజీనామా కోరబోమని, ఎందుకంటే పారిపోతారని తెలుసంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపైనే హరీష్ కౌంటర్ ఇచ్చారు.