శ్రీతేజ్ ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు

సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

Advertisement
Update:2024-12-26 17:01 IST

సంధ్య థియేటర్ ప్రీమియర్ షోలో తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్‌ఎస్ నేతలుతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ క్రమంలో శ్రీతేజ్ హెల్త్‌పై ఎటెన్షన్ ఏర్పడింది. అందుకే కిమ్స్ వైద్యులు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్‌లను విడుదల చేస్తున్నారు. శ్రీతేజ్ బాగానే కోలుకున్నాడని ఈరోజు డాక్టర్లు తెలిపారు.

ఎటువంటి ఆక్సిజన్ కానీ వెంటిలేటరీ సపోర్ట్ లేకుండా ఊపిరి తీసుకుంటున్నాడని తెలిపారు. అతను అప్పుడప్పుడు కళ్లు తెరుస్తున్నాడు కానీ.. ఐ కాంటాక్ట్ కానీ..కుటుంబ సభ్యులను గుర్తు పట్టడం లాంటివి కానీ చేయడం లేదని వెల్లడించారు. సైగలను గమనిస్తున్నాడు కానీ..మాటలను అర్థం చేసుకోలేకపోతున్నాడని తెలిపారు. నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ వెల్ ద్వారా ఫుడ్ ను అందిస్తున్నామని చెప్పారు డాక్టర్లు. హరీష్ రావు వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కేపీ వివేకనంద, శ్రీనివాస్ గౌడ్, బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు

Tags:    
Advertisement

Similar News