మానుకోట ఘటన.. ఇంకా కళ్ల ముందే - హరీష్ రావు

ఆధిపత్య అహంకారంతో తుపాకులు ఎక్కుపెట్టిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయని గుర్తుచేశారు హరీష్ రావు. తుపాకీ తూటాలకు దీటుగా తిరగబడ్డాయన్నారు.

Advertisement
Update: 2024-05-28 08:39 GMT

మానుకోట ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటనకు నేటితో 14 ఏళ్లు పూర్తయ్యాయన్నారు.

ఆధిపత్య అహంకారంతో తుపాకులు ఎక్కుపెట్టిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయని గుర్తుచేశారు హరీష్ రావు. తుపాకీ తూటాలకు దీటుగా తిరగబడ్డాయన్నారు. పోలీసుల బుల్లెట్లకు ప్రతిస్పందిస్తూ ఉద్యమకారులు చూపిన తెగువకు సమైక్య పాలకులు వెనుదిరుగక తప్పలేదన్నారు.


తెలంగాణ ఉద్యమ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చే ప్రయత్నాన్ని మానుకోట మట్టి సాక్షిగా ఉద్యమకారులు ఏకమై తిప్పికొట్టారని.. ఈ ఘటన ద్వారా స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటి చెప్పారన్నారు హరీష్ రావు. తుపాకీ తూటాలకు, లాఠీ దెబ్బలకు భయపడలేదన్నారు. ఈ చారిత్రక సన్నివేశాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయన్నారు హరీష్ రావు. చరిత్ర పుటల్లోనూ అవి చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.

Tags:    
Advertisement

Similar News