గొంతెండుతోంది.. నీళ్లయినా ఇవ్వండి - రేవంత్‌కు హరీష్ విజ్ఞప్తి
కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయన్నారు హరీష్ రావు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశాలు ఎప్పుడూ కనిపించలేదన్నారు.
తెలంగాణలో తాగునీటి సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ఓ ట్వీట్ చేశారు. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారని.. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారని చెప్పారు హరీష్ రావు. ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయన్నారు హరీష్ రావు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశాలు ఎప్పుడూ కనిపించలేదన్నారు. మారుమూల తండాల్లోనూ మిషన్ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేదని గుర్తుచేశారు. పంటలకు సాగునీళ్లు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజలకు గొంతు తడుపుకోడానికి మంచినీళ్ళయినా ఇవ్వాలని ట్వీట్‌లో కోరారు హరీష్ రావు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనడంతో ఆదివాసీ గూడాలు, గిరిజన తండాల్లో నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పల్లెల్లోనూ ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు అధికారులు.