మరి కొద్ది సేపట్లో బీఆరెస్ లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం
గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్ తరపున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. 9 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2015లో బీజేపీ లో చేరారు.
Advertisement
బీజేపీకి రాజీనామా చేసిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ మరి కొద్ది సేపట్లో భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు. బీఆరెస్ జాతీయ అధ్యక్షులు కేసీఆర్, గమాంగ్ కు శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆయనతో పాటు ఒడిశా మాజీ మంత్రి శివరాజ్ పాంగి, ఇతర ముఖ్య నాయకులు కూడా ఈ రోజు బీఆర్ఎస్ లో చేరనున్నారు.
గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్ తరపున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. 9 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2015లో బీజేపీ లో చేరారు.
గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ ఇద్దరూ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేశారు. అంతకు ముందే వీరిద్దరూ బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి చాలా సేపు చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
Advertisement