ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయండి.. ప్రధానిని కోరిన కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటే కాకుండా వచ్చే బడ్జెట్ లో ఓబీసీల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కూడా ఆయన ప్రధానిని కోరారు.
కేంద్రంలో ఓబీసీమంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం 18 ఏళ్ళుగా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. అయినా అప్పటి యూపీఏ ప్రభుత్వం కానీ, ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వంకానీ పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణం ఎన్డీఏ ప్రభుత్వం ఓబీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటే కాకుండా వచ్చే బడ్జెట్ లో ఓబీసీల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన ప్రధానిని కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. 2014 లో కేసీఆర్, బీసీల ప్రతినిధులతో కలిసి అప్పటి ప్రధాని మన్ మోహన్ సింగ్ ను కలిసి ఓబీసీ శాఖ కోసం అభ్యర్థిస్తున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్...
''ఈ ఫైల్ చిత్రాలు డిసెంబర్ 18, 2004 నాటివి. శ్రీ కేసీఆర్ గారు OBC సంఘాల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి, OBC సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ అప్పటి గౌరవనీయులైన ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్‌ను అభ్యర్థించారు.దురదృష్టవశాత్తు, ఈ డిమాండ్‌ను యుపిఎ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు'' అని కామెంట్ చేశారు. ...
''మేము OBCల డిమాండ్‌ను సానుకూలంగా పరిగణించాలని గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ని కూడా అభ్యర్థించాము.
NDA ప్రభుత్వం ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి 2023 బడ్జెట్ లో ఆ శాఖకు తగిన బడ్జెట్ కేటాయిస్తుందని ఆశిస్తున్నాము'' అని మరో ట్వీట్ చేశారు కేటీఆర్.