పదవతరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవ‌హారంపై నిజాలు నిగ్గుతేల్చండి... విద్యాశాఖ మంత్రి ఆదేశాలు

లీక్ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు రాస్తున్న 4.95 ల‌క్ష‌ల మంది విద్యార్థుల భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకొని అధికారులు, ఉద్యోగులు వ్యవహరించాలని, విద్యార్థులను గందరగోళానికి గురిచేయవద్దని ఆమె కోరారు.

Advertisement
Update:2023-04-04 16:21 IST

నిన్న తాండూర్ లో పదవతరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారంపై విచారణ నడుస్తుండగానే ఈ రోజు వరంగల్ లో హిందీ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందనే వార్తలు గుప్పుమన్నాయి.

ఈ లీక్ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు రాస్తున్న 4.95 ల‌క్ష‌ల మంది విద్యార్థుల భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకొని అధికారులు, ఉద్యోగులు వ్యవహరించాలని, విద్యార్థులను గందరగోళానికి గురిచేయవద్దని ఆమె కోరారు. రాజ‌కీయ, వ్య‌క్తిగ‌త స్వార్థాలు వీడి పనిచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

హిందీ ప్రశ్నా పత్రం లీక్ వ్యవ‌హారంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు జిల్లా పోలీసు కమిషనర్ కు పిర్యాదు చేయాలని మంత్రి వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ డీఈవోల‌కు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో అధికారులు హుటాహుటిన సీపీకి పిర్యాదు చేయగా, పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Tags:    
Advertisement

Similar News