బీజేపీలో వలసల ముసలం.. ఢిల్లీకి చేరిన ఆదిలాబాద్ పంచాయితీ

సోయం బాపురావుకి టికెట్ పై ఆశలు సన్నగిల్లాయి. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోడానికి ఆయన సిద్ధమయ్యారు.

Advertisement
Update:2024-03-11 15:00 IST

తెలంగాణ బీజేపీలో ఆశావహులున్నా కూడా ఆ పార్టీ వలస నేతలకు టికెట్లు ఖాయం చేయడంతో ఇప్పుడు మొదటికే మోసం వచ్చేలా ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఉన్నా కూడా అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ నగేష్ కి టికెట్ ఇస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆ హామీతోనే ఆయన నిన్న బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో సోయం బాపురావు వర్గం తాడోపేడో తేల్చుకోడానికి రెడీ అయింది. ఢిల్లీలో అధిష్టానం పెద్దల ముందు పంచాయితీ పెట్టారు ఆదిలాబాద్ నేతలు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో గెలిచిన 4 లోక్ సభ స్థానాల్లో ఆదిలాబాద్ ఒకటి. అక్కడ సోయం బాపురావు ఎంపీగా గెలిచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీలో చేరిన బాపురావు 2019నుంచి కమలదళంలోనే ఉన్నారు. ఈసారి కూడా ఆయన అక్కడ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో పేరు లేదు. కనీసం సెకండ్ లిస్ట్ లో అయినా ఉంటుందేమోనని ఆశపడ్డారు. ఈసారి ఏకంగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీని తీసుకొచ్చి పక్కలో బల్లెంలా మార్చారు. దీంతో సోయం బాపురావుకి టికెట్ పై ఆశలు సన్నగిల్లాయి. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోడానికి ఆయన సిద్ధమయ్యారు.

జంపింగ్ లపై ఎందుకంత ప్రేమ..

ఆదివారం బీజేపీలో చేరిన నలుగురు బీఆర్ఎస్ నేతలకు ఎంపీ టికెట్ల హామీ లభించినట్టు తెలుస్తోంది. బీజేపీలో ఆశావహులు ఉన్నా కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలస నేతలకు ఎందుకు టికెట్లు ఇస్తున్నారని నిలదీస్తున్నారు కొంతమంది. ఆదిలాబాద్ నేతలు మాత్రం నేరుగా ఢిల్లీ వెళ్లారు. అక్కడే తేల్చుకుంటామంటున్నారు. కొత్తగా చేరిన నగేష్ నాయకత్వాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపు, పలువురు బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌ను వారు కలవబోతున్నారు. పార్టీకోసం పనిచేసిన వారిని కాదని కొత్తవారికి టికెట్ ఎలా ఖాయం చేస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News