రైతన్నలారా ఆత్మస్థైర్యం కోల్పోకండి

మళ్లీ మంచి రోజులు వస్తాయ్‌.. ఆత్మహత్యలు వద్దు : కేటీఆర్‌

Advertisement
Update:2024-10-06 12:28 IST

రైతన్నలారా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ 'ఎక్స్‌' వేదికగా విజ్ఞప్తి చేశారు. ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ మంచి రోజుల వస్తాయని ధైర్యంగా ఉండాలని సూచించారు. ''పొలం ఉన్న రైతులనూ పొట్టుబెట్టుకుంటున్నారు.. కౌలు తీసుకున్న కర్షకులనూ కబళిస్తున్నారు.. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే కారణం.. ఓవైపు సాగునీటి సంక్షోభం.. మరోవైపు రుణమాఫీ ద్రోహం.. ఇంకోవైపు రైతుభరోసా మోసం.. కౌలు రైతులకూ అందని సాయం.. రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టడంతోనే, వ్యవసాయంలో ఈ విలయం.. వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా చలనం లేదు.. ముఖ్యమంత్రికి సోయి లేదు.. ప్రభుత్వానికి బాధ్యత లేదు.. దసరా పండుగ వేళ.. వ్యవసాయాన్ని దండుగలా మార్చిన.. సీఎం రేవంత్ కు రైతన్నల చేతిలో దండన తప్పదు .. '' అని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News