బీఆర్‌ఎస్‌కు మద్దతుగా మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర నిర్వహించిన రైతు దంపతులు
ఈ దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని పాలించిన రాజకీయ పార్టీలు పట్టించుకోని రైతుల సమస్యలను బీఆర్‌ఎస్ మాత్రమే పరిష్కరించగలదని అన్నారు.
దేశంలో రైతుల కష్టాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే పరిష్కారం చూయించగలరని, అందువల్ల ఆయన దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటూ మహారాష్ట్రకు చెందిన ఓ రైతు దంపతులు హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టారు.
మహారాష్ట్ర, చంద్రపూర్ జిల్లాలోని రాజురా నియోజకవర్గానికి చెందిన బాబా రావు, శోభా మస్కీ దంపతులు బీఆర్‌ఎస్‌కు మద్దతుగా పాదయాత్ర చేపట్టారు.
కేసీఆర్ ను కలిసి ఆయన ప్రయత్నాలకు సంఘీభావం తెలపడానికి సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
ఈ దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని పాలించిన రాజకీయ పార్టీలు పట్టించుకోని రైతుల సమస్యలను బీఆర్‌ఎస్ మాత్రమే పరిష్కరించగలదని అన్నారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా విస్తరించాలని కోరుతూ మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు స్వాగతం పలుకుతున్న బ్యానర్ నుప్రదర్శిస్తూ వీళ్ళు పాదయాత్ర చేశారు. వీళ్ళు తమ పాదయాత్రలో శరీరానికి సంకెళ్లు వేసుకుని మరీ నడిచారు..
ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం కూడా వారు డిమాండ్ చేశారు. ఈ జంట గతంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా పాదయాత్ర చేపట్టి కేసీఆర్ ను కలిశారు.