ఫార్మ్ హౌజ్ నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్ళొద్దు - హైకోర్టు ఆదేశం

మొయినాబాద్ ఫామ్ హౌజ్ కుట్ర కేసులో నిందితులు ముగ్గురు హైదరాబాద్ దాటి వెళ్ళవద్దని హైకోర్టు ఆదేశించింది. వారు ముగ్గురు హైదరాబాద్ లో ఉంటున్న ఇంటి చిరునామాలను సైబరాబాద్ సీపీకి అందజేయాలని కూడా హైకోర్టు చెప్పింది.

Advertisement
Update:2022-10-28 17:36 IST

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర లో నిందితులైన రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ రిమాండ్ కు ఏసీబీ కోర్టు తిరస్కరించడంతో పోలీసులు ఈ రోజు తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసు విచారణను చేపట్టిన కోర్టు నిందితులు ముగ్గురు హైదరాబాద్ ను వదిలి వెళ్ళవద్దని ఆదేశాలు జారీ చేసింది. వారు ముగ్గురు హైదరాబాద్ లో ఉంటున్న ఇంటి చిరునామాలను సైబరాబాద్ సీపీకి అందజేయాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

అంతకు ముందు పోలీసుల తరపున వాదించిన‌ అడ్వకేట్ జనరల్ , ప్రతి సందర్భంలో సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు. రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ లను తక్షణం రిమాండ్ చేయాలని ఆయన హైకోర్టును కోరారు.

మరో వైపు ఫామ్ హౌజ్ కేసు పై బీజేపీ నాయకులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణను కూడా హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.ఫామ్ హౌజ్ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో కానీ సీబీఐ తో కానీ సమగ్రంగా విచారణ జరిపించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, రాజేంద్ర నగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్‌హెచ్ఓ, కేంద్ర హోం ఆఫ్ఫైర్స్, సీబీఐ, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.

Tags:    
Advertisement

Similar News