డ్రగ్స్ పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ అరెస్టు

హైదరాబాద్‌ మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది.

Advertisement
Update:2024-12-02 10:26 IST

హైదరాబాద్‌ మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. ఓయో హోటల్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్హ మహంతిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ ఈవెంట్ నిర్వహించిన ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీ కోసం బెంగళూరు నుంచి ఎండీఎంఏతో పాటు మరో రెండు రకాల డ్రగ్స్‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కన్హ మహంతి ఓ టీవీషోలో కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నారు. హైదరాబాద్‌లోడ్రగ్స్ అధిక మొత్తంలో దొరకడంతో యువత విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనిపై సామాన్యులకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News