సెక్రటేరియట్‌లో రేపటి నుంచే ఫేస్ రికగ్నైజేషన్ అటెండన్స్
ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ
తెలంగాణ సెక్రటేరియట్‌లో పని చేసే అధికారులు, ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది గురువారం నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారా అటెండెన్స్ నమోదు చేయాలని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇష్టం వచ్చిన సమయానికి డ్యూటీలకు వచ్చి.. ఇష్టం వచ్చిన సమయానికి వెళ్లిపోతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టం తీసుకువచ్చారు. సెక్రటేరియట్‌లోకి ఎంట్రీ అయ్యే అన్ని పాయింట్ల వద్ద ఈ పరికరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఫేక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అధికారులు, ఉద్యోగులు, రెగ్యులర్ స్టాఫ్‌తో పాటు సెక్రటేరియట్ హెడ్ ఆఫ్ ఎకౌంట్స్ నుంచి జీతాలు చెల్లించే ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారానే హాజరు నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.