దుబ్బాక కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో తీవ్ర ఉద్రిక్తత

దుబ్బాకలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. ఎటువంటి అధికారం లేకుండా చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్టేజీ పైన ఉండడంతో దుమారం రేగింది

Advertisement
Update:2024-09-26 15:22 IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కల్యాణలక్ష్మీ చెక్కుల పంపీణి కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. మంత్రితో పాటు స్టేజి పైకి వెళ్లారు కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. దీంతో స్టేజీ పైకి ఓడిపోయిన వారు రావద్దని, ప్రోటోకాల్ పాటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు పట్టు బట్టారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు రావద్దరని ప్రోటోకాల్ పాటించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ డిమాండ్ చేశారు. కచ్చితంగా స్టేజీపైనే శ్రీనివాస్‌రెడ్డి ఉంటాడని కాంగ్రెస్ నేతలు చెప్పడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది.అయితే అధికారిక కార్యక్రమానికి శ్రీనివాస్ రెడ్డి హాజరు కావడాన్ని బీఆర్ఎస్ వర్గాలు తప్పుబట్టాయి. వేదికపై శ్రీనివాస్ రెడ్డి ఉండవద్దని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. 

Tags:    
Advertisement

Similar News