కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా జారీచేసిన ఉత్తర్వుల పొడిగింపు
గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఈ నెల 31 వరకు పొడిగించిన ఉన్నతన్యాయస్థానం
Advertisement
ఫార్ములా ఈ- రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నతన్యాయస్థానం ఈ నెల 31 వరకు పొడిగించింది. తదుపరి విచారణను అదేరజుకు వాయిదా వేసింది. గతంలో హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసుపై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది.
Advertisement