యశోద సినిమా యూనిట్‌పై పరువునష్టం దావా
EVA IVF ఆసుపత్రి యజమాని డా.మోహన్ కుమార్ ఆరోపించారు. యశోద సినిమా హీరోయిన్ నటి సమంత , దర్శక ,నిర్మాత ల బృందంపై 5 కోట్ల రూపాయలకు పరువునష్టం కోరినట్లు వెల్లడించారు.
సమంత ప్రధాన పాత్రలో నటించి, ఇటీవల విడుదలైన యశోద సినిమాపై హైదరాబాద్‌కు చెందిన సంతాన సాఫల్య ఆసుపత్రి యాజమాన్యం పరువునష్టం దావా వేసింది. యశోద సినిమాలో ఆసుపత్రి పేరును దుర్వినియోగం చేస్తూ తమ ఆసుపత్రి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినట్లు ఈ దావాలో EVA IVF ఆసుపత్రి యజమాని డా.మోహన్ కుమార్ ఆరోపించారు. యశోద సినిమా హీరోయిన్ నటి సమంత , దర్శక ,నిర్మాత ల బృందంపై 5 కోట్ల రూపాయలకు పరువునష్టం కోరినట్లు వెల్లడించారు.
సమంత టైటిల్ రోల్‌లో సరోగసీ నేపథ్యంలో రూపొందిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'యశోద సినిమా ఈ నెల 11న విడుదలైంది. సమంత, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ, ప్రీతి అస్రాణి తదితరులు నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. శివలెంక కృష్ణప్రసాద్, చింతా గోపాలకృష్ణారెడ్డిలు నిర్మాత, సహ నిర్మాతలుగా నిర్మించిన ఈ సినిమాకు హరి శంకర్, హరీష్ నారాయణ్‌లు దర్శకత్వం వహించారు.
సినిమాలో యశోద (సమంత ) కు డబ్బు అవసరం ఉంటుంది. సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకు ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని ఆశ చూపడంతో యశోద ఓకే అంటుంది. ఆమెను హైదరాబాద్‌లోని సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఏం జరుగుతోంది..? హైదరాబాద్‌లో అనుమానాస్పద రీతిలో మరణించిన హాలీవుడ్ నటికి, ఈ సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు ఏమైనా సంబంధం ఉందా..? అన్న కోణంలో సినిమా కథ నడుస్తుంది.