ఓటు వేసే విధానం ఇదే! ఈ రూల్స్ మర్చిపోవద్దు!
ఈ నెల 30 న తెలంగాణలో పోలింగ్ డే. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరి ఈ సందర్భంగా పోలింగ్ ఎలా జరుగుతుంది? ఓటు వేసే ప్రాసెస్ ఏంటి? అనే విషయాలు తెలుసుకుందామా!
ఈ నెల 30 న తెలంగాణలో పోలింగ్ డే. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరి ఈ సందర్భంగా పోలింగ్ ఎలా జరుగుతుంది? ఓటు వేసే ప్రాసెస్ ఏంటి? అనే విషయాలు తెలుసుకుందామా!
ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఓటు వేయాలంటే పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలి. అందుకే ముందుగా మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవాలి. దానికోసం ఎలక్షన్ కమీషన్ వెబ్‌సైట్ లేదా సీవిజిల్ యాప్ వంటివి వాడొచ్చు.
ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి. పోలింగ్ కేంద్రం దగ్గర పార్టీల గుర్తులు, రంగులు కలిగిన బట్టలు, టోపీల వంటివి ధరించకూడదు. పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. బూత్ లోపలికి సెల్‌ఫోన్లు తీసుకెళ్లకూడదు. అక్కడుండే భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలి.
ఓటర్ లిస్ట్‌లో ఉన్న పేరు, గుర్తింపు కార్డు చూసి అధికారులు పోలింగ్ బూత్‌లోకి పంపుతారు. అక్కడ ఎడమచేతి చూపుడు వేలు చెక్ చేసి దానికి సిరా వేస్తారు. ఆ తర్వాత రిజిస్టర్‌లో ఓటరు వివరాలు నమోదు చేసి స్లిప్ రాసి ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తారు. తర్వాత ఓటరు.. పోల్ చీటీ తీసుకుని కంట్రోల్ యూనిట్ (సీయూ) దగ్గరికి వెళ్లి ఓటు వేయాలి. సీయూలో బటన్ నొక్కిన తర్వాత మీరు ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా మీ ఓటుని నిర్ధారించుకోవచ్చు. ఇలా ఓటింగ్ ప్రక్రయ జరుగుతుంది.
ఓటు వేయడంలో ఏవైనా ఇబ్బందులున్నా, మీ ఓటు మరొకరు వేసినా.. వెంటనే పోలింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఏ టైంలో అయినా వెళ్లి ఓటు వేయొచ్చు.