పశు వైద్యుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి శ్రీనివాసయాదవ్

పశు వైద్యుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

Advertisement
Update:2023-05-17 21:01 IST

పశు వైద్యుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలోని తన చాంబర్ లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ల అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం, వ్యాధి నిరోధక టీకాలు వేయడం, గ్రామాలలోని జీవాలకు వైద్య సేవలు అందించడం వంటి అనేక కార్యక్రమాల అమలులో పశువైద్యులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. శాఖ లోని వైద్యులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టవలసిన చర్యలపై అధ్యయనం చేసి నివేదికను అందజేయాలని పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ని మంత్రి ఆదేశించారు. నివేదికను సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని మంత్రి హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు, డివిజన్ లు, మండలాలను ఏర్పాటు చేశారని...అందుకు అనుగుణంగా నియామకాలు చేపడితే జీవాలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు అంతకు ముందు మంత్రికి విన్నవించారు.

పశుసంవర్ధక శాఖను పునర్ వ్యవస్తీకరించాలని, దాని ద్వారా అనేక పోస్టుల ఏర్పాటు జరుగుతుందని, దీంతో ఎన్నో సంవత్సరాల నుండి పదోన్నతులు లేని తమకు పదోన్నతుల అవకాశం లభిస్తుందని చెప్పారు.

అదేవిధంగా GHMC లో మాదిరిగా రాష్ట్రంలోని మున్సిపాలిటీ లలో వీదికుక్కలు, కోతుల బెడద నివారణ, వాటికి అవసరమైన వైద్య సేవలు అందించడం, పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ల విజ్ఞప్తులకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, VAS అసోసియేషన్ అద్యక్షులు విష్ణువర్ధన్ గౌడ్, జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి, ట్రెజరర్ ధర్మా నాయక్, తెలంగాణ వెటర్నరీ అసోసియేషన్ అద్యక్షుడు రమేష్, జనరల్ సెక్రెటరీ మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News