ఫెంగల్ తుపాను ప్రభావం.. ఏపీలో ఆ ఎన్నికలు వాయిదా
ఫెంగల్ తుపాను, భారీ వర్షాల కారణంగా ఏపీలో ఈనెల 5న జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఏపీలో ఈనెల 5న జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి ప్రభుత్వం వాయిదా వేసింది. తుపాను, భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాట్లు పేర్కొంది. త్వరల్లోనే మరో తేదీని వెల్లడిస్తామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాయిదాపై కలెక్టర్లకు సమాచారం పంపారు.
సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీల ఎన్నికలకు ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 6,149 సాగునీటి సంఘాలు , 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఓటరు జాబితాల రూపకల్పన, చేపట్టాల్సిన ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఫెయింజల్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం వాయిదా నిర్ణయం తీసుకుంది.