కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
జనవరి 7న విచారణకు రావాలని పేర్కొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
Advertisement
ఫార్ములా ఈ- రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జవని 2,3 న విచారణకు రావాలని అరవింద్, బీఎల్‌ఎన్ రెడ్డికి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేస్తున్నది.
Advertisement