ఎకనామిక్స్ వర్సెస్ జుమ్లానోమిక్స్..

కోవిడ్ కి ముందే భారత ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందని, లాక్ డౌన్ తర్వాత అది మరింత దిగజారిందని, ప్రస్తుతం ప్రజలు ఆ భారాన్నంతా భరిస్తున్నారని చెప్పారు.

Advertisement
Update:2022-08-04 19:19 IST

కేంద్ర ప్రభుత్వానివి ఎకనామిక్స్ కావని, కేవలం జుమ్లానోమిక్స్ అని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కేంద్రం జుమ్లానోమిక్స్ ని కప్పిపెట్టడానికి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని అన్నారాయన. కేంద్రాన్ని ఎన్డీఏ అని సంబోధంచడం మానేసిన కేటీఆర్.. నాన్ పర్ఫామింగ్ అసెట్స్ (NPA) గవర్నమెంట్ అని ఎద్దేవా చేస్తున్నారు.

ఈ సత్యాలను ఎలా దాచిపెట్టగలరు..?

- 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం

- ఎప్పుడూ లేనంత బలహీనమైన రూపాయి. డాలర్ తో పోలిస్తే 80 రూపాయలకు పతనం

- 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగత

- ప్రపంచంలోనే అత్యధిక వంట గ్యాస్ రేటు ఉన్న దేశంగా పేరు

- పేదరికంలో నైజీరియాను అధిగమించిన భారత్..

నోట్ల రద్దు వంటి వినాశకరమైన విధానాలతో ఎన్డీఏ.. ఎన్పీఏగా మారిందని విమర్శించారు కేటీఆర్. బ్రూట్ ఫోర్స్ ద్వారా జీఎస్టీ కౌన్సిల్ నుంచి, పార్లమెంట్ నుంచి మీరు తప్పించుకోవచ్చు, వరుసగా రెండేళ్ల ఆర్థిక మందగమనం ఇప్పుడు భారత్ ని పట్టి పీడిస్తోందని, దాన్నుంచి ప్రజలను ఎవరు తప్పించగలరని ప్రశ్నించారు కేటీఆర్. ఈమేరకు ట్విట్టర్‌లో సీరియస్ కామెంట్స్ చేశారు. కోవిడ్ కి ముందే భారత ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందని, లాక్ డౌన్ తర్వాత అది మరింత దిగజారిందని, ప్రస్తుతం ప్రజలు ఆ భారాన్నంతా భరిస్తున్నారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News