మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్.. ఎందుకంటే..?

ఈనెల ఒకటవ తేదీన వరంగల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు సురేఖ.

Advertisement
Update:2024-04-27 08:13 IST

మంత్రి కొండా సురేఖపై సీరియస్ అయింది ఎలక్షన్ కమిషన్. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఇటీవల చేసిన కామెంట్స్‌ విషయంలో కొండా సురేఖకు వార్నింగ్ ఇచ్చింది ఈసీ. ఎన్నికల వేళ జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. ఆరోపణలు చేసే సమయంలో మంత్రిగా మరింత బాధ్యతగా వ్యవహరించాలని తెలిపింది.

అసలు ఏం జరిగిందంటే..!

ఈనెల ఒకటవ తేదీన వరంగల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు సురేఖ. ఫోన్ ట్యాపింగ్‌తో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని, అధికారులను బదిలీ చేశారని, అనేకమందిని ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారన్నారని ఆరోపించారు.



అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టిన ఈసీ.. ఆమెకు వార్నింగ్ ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News