సీఎం రేవంత్‌కు ఈసీ షాక్.. 48 గంటలు డెడ్‌లైన్
రేవంత్ రెడ్డి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి వ్యక్తిగత విమర్శలు, దూషణకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నేత ఎం.శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 5న ఈసీకి ఫిర్యాదు చేశారు
సీఎం రేవంత్ రెడ్డికి షాకిచ్చింది ఎన్నికల కమిషన్. మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను ఉద్దేశించే కించపరిచే వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ రేవంత్‌కు నోటీసులు జారీ చేసింది ఈసీ. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఓ బహిరంగ సభలో కేసీఆర్‌ను ఉద్దేశించి.. మతి ఉండి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియట్లేదు. సోయిలేనోడు, సన్నాసోడు, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడా అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్. దీంతో రేవంత్ రెడ్డి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి వ్యక్తిగత విమర్శలు, దూషణకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నేత ఎం.శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 5న ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఐతే ఇటీవల కేసీఆర్ ప్రచారంపై 48 గంటల బ్యాన్ విధించిన ఈసీ.. సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. కేవలం వివరణ ఇవ్వాలన్న ఆదేశాలతో సరిపెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.