కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ నిషేధం.. ఎందుకంటే.!

కాంగ్రెస్ ఫిర్యాదు మేర‌కు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు కేసీఆర్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

Advertisement
Update:2024-05-01 19:18 IST

మరో 12 రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్ ప్రచారంపై ఆంక్షలు విధించింది ఎన్నికల కమిషన్. 48 గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. ఈ రోజు రాత్రి 8 గంట‌ల నుంచి 48 గంట‌ల పాటు కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం విధించిన‌ట్లు ఈసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఏప్రిల్ 5న సిరిసిల్లలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్‌ను ఉద్దేశించి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఏప్రిల్ 6న ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు హస్తం పార్టీ నేతలు. కాంగ్రెస్ ఫిర్యాదు మేర‌కు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు కేసీఆర్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కరీంనగర్ బహిరంగ సభ, 2023 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో బాన్సువాడలో కేసీఆర్‌ స్పీచ్‌లపైనా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఈసీ గుర్తు చేసింది.


కేసీఆర్ ఏమన్నారంటే.!

సిరిసిల్ల కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి పద్మశాలీలను ఉద్దేశించి కండోమ్‌లు, పాపడ్స్‌ అమ్ముకోవాలనడంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. కుక్కల కొడుకులు అంటూ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు కేసీఆర్. దీనిపైనే కాంగ్రెస్‌ నేత జి. నిరంజన్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అధికారులు కేసీఆర్ MCC రూల్స్‌ను ఉల్లంఘించినట్లు నిర్ధారించి చర్యలు తీసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News