హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. 27 మందికి పాజిటివ్
డ్యాన్స్ మ్యూజిక్ నైట్ పార్టీలో పాల్గొన్న 55 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. వీరిలో 27 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. వారందరిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా డ్రగ్స్ వాడకం తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం సృష్టించాయి. వీకెండ్ కావడంతో శనివారం రాయదుర్గం పీఎస్ పరిధిలోని ఖాజాగూడ ది కేవ్ క్లబ్ EDM (ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్) నైట్ నిర్వహించింది. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో నార్కొటిక్స్ అధికారులు ది కేవ్ క్లబ్‌పై ఆకస్మిక దాడులు చేశారు.
డ్యాన్స్ మ్యూజిక్ నైట్ పార్టీలో పాల్గొన్న 55 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. వీరిలో 27 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. వారందరిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌తో పట్టుబడిన వారిలో డీజే ఆపరేటర్లు, పబ్ నిర్వాహకులు ఉన్నారు.
పబ్‌లో గంజాయి, కొకైన్, మెథాంఫెటామిన్ అనే డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ నిర్వహణ వెనుక ఎవరెవరు ఉన్నారని ఆరా తీస్తున్నారు.